RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున ఈ రెండు బ్యాంకులపై ఈ జరిమానా విధించినట్లు RBI తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.12.19 కోట్ల జరిమానా విధించింది. బ్యాంకులో అనర్హత కలిగిన బ్యాంకులను రుణాలు ఇచ్చిన విషయాన్ని దాచినందుకు ఆర్బీఐ సదరు బ్యాంకు పై ఈ చర్య తీసుకుంది. ఈ సమయంలో జరిగిన మోసాన్ని ఐసీఐసీఐ బ్యాంకు దాచిపెట్టింది. దీంతో ICICI బ్యాంక్‌పై RBI పెనాల్టీని విధించింది.
Read Also:Chhattisgarh Assembly Election: అమిత్ షాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక సేవల ఔట్‌సోర్సింగ్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్, ప్రవర్తనా నియమావళి(code Of Conduct)కి సంబంధించిన సూచనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు ఆర్‌బిఐ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ చర్య బ్యాంక్, కస్టమర్ సర్వీస్, లోన్, అడ్వాన్స్ ప్రొవిజన్‌ల ద్వారా నామినేట్ చేయబడిన రికవరీ ఏజెంట్‌లోని లోపాలకు కూడా సంబంధించినది. మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించిన సూచన ఆధారంగా బ్యాంక్ చట్టబద్ధమైన ఆడిట్ జరిగింది. సర్వీస్ ప్రొవైడర్‌పై వార్షిక సమీక్ష నిర్వహించడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్‌బీఐ గుర్తించింది. తమ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం సాయంత్రం 7 గంటల తర్వాత ఉదయం 7 గంటలకు ముందు కస్టమర్‌లను నిబంధనలకు విరుద్ధంగా సంప్రదించిందని తేలడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్‌బిఐ ప్రకారం, బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడంతో రెండు కేసులలో జరిమానా విధించింది.
Read Also:Nellore Crime: తల్లితో కలిసి 8 నెలల గర్భిణి ఆత్మహత్య.. భర్త మరణాన్ని తట్టుకోలేక..!
