Site icon NTV Telugu

M. Rajeshwar Rao: డిజిటైజేషన్ దిశగా సహకార బ్యాంకులు పని చేయాలి

RBI MR RAO

Collage Maker 28 Jan 2023 04.55 Pm

30 ఏళ్ళ తర్వాత మళ్ళీ విజయవాడ రావటం సంతోషంగా ఉందన్నారు ఆర్బీఐ, , డిప్యూటీ గవర్నర్ ఎమ్. రాజేశ్వరరావు. ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. ఈ కాంక్లేవ్ లో రాజేశ్వరరావు మాట్లాడారు. నియంత్రణలు దేశ వ్యాప్తంగా ఓకే రకంగా ఉండాలి. సహకార బ్యాంకులు కూడా విస్తృతంగా ఆర్ధిక సేవలు అందిస్తున్నాయి. ఆర్ధిక విధానాలలో కోఆపరేటివ్ బ్యాంక్ లు సమతౌల్యత పాటిస్తాయి. కోవిడ్ తరువాత సహకార సంస్ధలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కోవిడ్ కష్టాల నుంచీ బయట పడటానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుందన్నారు.

Read Also: Heavy Rains : న్యూజిలాండ్‎ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA) లు 8.7శాతం పెరిగాయి. డిపాజిట్లు 10.5శాతం.. రుణాలు 7.5శాతం పెరిగాయి. స్ధిరమైన అభివృద్ధి సాధించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చాక బ్యాంకుల పనితీరు కూడా మారింది. దీర్ఘకాలిక సమస్యలు తీర్చడానికి ఒక ప్రత్యేక సంస్ధ ఏర్పాటు కావాలి. వెంటనే ప్రతిస్పందించే వ్యవస్ధ చాలా ముఖ్యమైనది. క్యాపిటల్ పెంచడానికి, డిపాజిట్ల సేకరణ చాలా ముఖ్యమైనది. సహకార బ్యాంకులకు క్యాపిటల్ పెంచడం కొంత కష్టతరమే అన్నారు. ఆర్బీఐ ద్వారా అంతర్గత ఆడిట్ విధానం అమలు చేయడం ద్వారా క్వాలిటీ సర్వీసు ఇవ్వవచ్చు. డిజిటైజేషన్ దిశగా సహకార బ్యాంకులు పని చేయాలి. సహకార బ్యాంకులు ఐటీ విధానాలు అభివృద్ధి చేయడం ద్వారా పోటీ ప్రపంచంలో ముందుకెళతాయన్నారు.

అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎమ్. రాజేశ్వరరావు. తాడేపల్లి సీఎం జగన్ నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా పాల్గొన్నారు.

Read Also: Jairam Ramesh: ప్రతిపక్ష కూటములకు జైరాం ట్విస్ట్.. బీజేపీపై పోరుకి కాంగ్రెసే పెద్ద దిక్కు

Exit mobile version