RBI: మీకు హోంలోన్ ఉందా.. ఇంటిపత్రాలు పెట్టారా.. బ్యాంకు మీ పత్రాలు పోగొట్టిందా.. అయితే శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రుణం ఇవ్వడానికి బ్యాంకులు మీ నుండి కొన్ని పత్రాలను డిమాండ్ చేయడం తరచుగా చూసే ఉంటాం. రుణం పూర్తిగా చెల్లించే వరకు బ్యాంకులు ఈ పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి. కానీ మీరు బ్యాంకు నుండి మీ పత్రాలను పోగొట్టుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా ? దీని కోసం ఆర్‌బీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మీ పత్రాలు బ్యాంక్ నుండి పోగొట్టుకున్నట్లయితే, బ్యాంకు మీకు పరిహారం చెల్లించవలసి ఉంటుంది.
Read Also:Inter Supplementary Exam: నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
రుణ గ్రహీతకు ఈ పత్రాలు చాలా ముఖ్యమైనవి. అటువంటి పరిస్థితిలో అవి పోయినట్లయితే తీవ్రంగా ఇబ్బంది పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్‌బిఐ ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదించాలని ఆలోచిస్తోంది. మీ పత్రాలు పోయినట్లయితే అప్పుడు బ్యాంకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాజీ ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ బిపి కనుంగో తన నివేదికను సెంట్రల్ బ్యాంక్‌కు అందించారు. అందులో రుణగ్రహీత పేపర్‌ను పోగొట్టుకుంటే బ్యాంకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. జూలై 7 వరకు ఈ సిఫార్సుపై వాటాదారుల అభిప్రాయాలను కోరింది.
Read Also:Varahi Yatra: పవన్ వారాహి యాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్
ఎవరైనా రుణ ఖాతా మూసివేయబడితే, అతని అన్ని పత్రాలను సురక్షితంగా తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ తేదీని నిర్ణయించాల్సి ఉంటుందని ప్యానెల్ తన సిఫార్సులో సూచించింది. పత్రాలను తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే, బ్యాంకు రుణగ్రహీతకు జరిమానా రూపంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రుణం పూర్తిగా తిరిగి చెల్లించబడే వరకు బ్యాంకులు ఈ పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి. రుణగ్రహీత సకాలంలో రుణాన్ని చెల్లించకపోతే, ఈ పత్రాల సహాయంతో బ్యాంకు వారిపై చర్య తీసుకోవచ్చు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!