NTV Telugu Site icon

MLA Srikanth Reddy: బీసీ నేత వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య!

Mla Srikanth Reddy

Mla Srikanth Reddy

రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య అని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసిందన్నారు. పోలింగ్ రోజే బీసీ నేత అయిన వెంకటేశ్వర్లను టీడీపీ నేతలు దూషించడం బాధాకరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే.. గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.

రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ దాడి చేయడం హేయమైన చర్య. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసింది. పోలింగ్ రోజే బీసీ నేత వెంకటేశ్వర్లను టీడీపీ నేతలు దూషించడం బాధాకరం. రాయచోటిలో ప్రశాంత వాతావరణన్ని చెడగొట్టడానికి అల్లరి గ్యాంగులు తయారయ్యాయి. మైనార్టీ నేతల షాపులపై టీడీపీ దాడులు చేయడం దారుణం. భవిష్యత్తులో ఇలాంటివి కొనసాగితే గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. ఓ ప్రకటనలో వైసీపీ నేతలపై జరిగిన దాడులను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఖండించారు.

Show comments