Ravi Teja : నార్వేలో రవితేజ ‘మాస్ జాతర’
- మాస్ జాతర సినిమాతో వస్తున్న మాస్ మహారాజ్
- కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ
- మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja : విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ క్రియేటివ్ గా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానులతో పాటు, సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. “మాస్ జాతర” చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. “మాస్ జాతర” అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు.
Read Also: Vivo X200 Series: భారతదేశంలో ప్రీమియం రేంజ్‌లో విడుదలైన Vivo X200 సిరీస్
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రీసెంటుగా రవితేజ చేతికి సర్జరీ జరిగింది. దీంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన, ఇప్పుడు తిరిగి మాస్ జాతర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. యూరప్‌లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మంచులో ఈ చిత్రానికి సంబంధించిన సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇక పై ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Read Also:Grandhi Srinivas: ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ పార్టీలో చేరుతా..
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!