Site icon NTV Telugu

Ravindra Jadeja: రవీంద్ర జడేజా చరిత్ర.. ప్రపంచంలోనే ‘ఒకే ఒక్కడు’!

Ravindra Jadeja

Ravindra Jadeja

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 2000 పరుగులు, 100 వికెట్స్ తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 89 రన్స్ చేయడం ద్వారా జడేజా ఈ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేశాడు.

2021లో డబ్ల్యూటీసీ ప్రారంభం అయింది. రవీంద్ర జడేజా ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు ఆడి 2010 పరుగులు, 132 వికెట్లు పడగొట్టాడు. డబ్ల్యూటీసీలో మూడు సెంచరీలు చేసిన జడ్డూ.. బౌలింగ్‌లో ఆరు సార్లు 5 వికెట్స్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ మాత్రమే జడేజాకు దగ్గరలో ఉన్నాడు. డబ్ల్యూటీసీలో స్టోక్స్ 2000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు కానీ.. 100 వికెట్లు తీయలేదు. 55 మ్యాచ్‌ల్లో 3365 పరుగులు చేసిన స్టోక్స్.. 86 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జడేజా కేవలం 41 మ్యాచ్‌ల్లోనే 2000 పరుగులు చేసి.. 100 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

Also Read: Barlapudi Kranti: యాక్టివ్ అవుతున్న ముద్రగడ కుమార్తె.. జనసేన కీలక పదవిపై ఆశలు!

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో లోయర్ ఆర్డర్ పతనం తర్వాత రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 211 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయినప్పుడు జడ్డూ బ్యాటింగ్‌కు వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా.. 203 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే జడేజా 11 పరుగుల తేడాతో తన సెంచరీ కోల్పోయాడు. జడేజాను జోష్ టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

Exit mobile version