టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో జడ్డు రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 72 రన్స్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
రవీంద్ర జడేజాకు ముందు ఈ రికార్డు వినూ మన్కడ్ సాధించాడు. 1952లో లార్డ్స్ మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 184 రన్స్ చేశాడు. 93 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లో జడ్డు హాఫ్ సెంచరీలు బాదాడు. క్రికెట్ చరిత్రలో లార్డ్స్ మైదానంకు ప్రత్యేక చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ సెంచరీ చేసినా.. ఫైవ్ వికెట్ హాల్ పడగొట్టినా హానర్ బోర్డుపై పేరు ఎక్కుతుంది. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయాలని బ్యాటర్, 5 వికెట్స్ తీయాలని బౌలర్ కలలు కంటాడు. మూడో టెస్టులో బుమ్రా 5 వికెట్స్ పడగొట్టి హానర్ బోర్డులో తన పేరును లిఖించుకున్నాడు.
Also Read: Shubman Gill: గెలుస్తామనే నమ్మకం ఉంది.. అదే మా కొంపముంచింది!
మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 181 బంతుల్లో 61 రన్స్ చేసి విరోచిత పోరాటం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్నారు. ఈ ఇద్దరి అండతో జడేజా టీమిండియాను విజయం వైపు నడిపించాడు. సిరాజ్ బాగా ఆడినా.. బంతి ఆపలేక మూల్యం చెల్లించాడు.
