NTV Telugu Site icon

Ravindra Jadeja: పుష్పగాడి స్టైల్లో జడ్డూ ఎంట్రీ.. వీడియో వైరల్

Jadeja

Jadeja

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న జడేజా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరారు. పుష్ప మ్యూజిక్, డైలాగ్‌తో అల్లు అర్జున్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ‘జడ్డూ అంటే పేరు కాదు బ్రాండ్’ అని జడేజా చెప్పిన డైలాగ్ వీడియోను చెన్నై టీమ్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చెన్నై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025కి సిద్ధం కండి.. ఇక తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈనెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా చెన్నై జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ధోనీ కూడా ఇటీవల జట్టులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

Read Also: Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు

దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమండియా విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఆచితూచి.. జాగ్రత్తగా ఆడాడు. టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌ల్లో 4.35 ఎకానమీ రేటుతో ఈ ఆల్ రౌండర్ 5 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు. కాగా.. ఈ ట్రోఫీతో భారత్ మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2025 సీజన్‌లో చెన్నై 6వ ఐపీఎల్ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే హోమ్ మ్యాచ్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత చెపాక్‌లో ఆర్సీబీతో మరో మ్యాచ్ జరుగనుంది.

Read Also: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ ఇవ్వాల్సింది: అశ్విన్‌

IPL 2025 కోసం చెన్నై పూర్తి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ఎంఎస్ ధోనీ, రాహుల్ త్రిపాఠి, వంశ్ బేడీ, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, సామ్ కర్రాన్, దీపక్ హుడా, జామీ ఓవర్‌టన్, విజయ్ శంకర్, రామకృష్ణ ఘోష్, చో ముకలేష్, రామకృష్ణ ఘోష్. పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్.