Ravindra Jadeja : గత కొద్దిరోజులుగా టీమిండియా ఫ్యాన్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. బిజిటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ రూపంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా వారం గ్యాప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ICT ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా పేరు తెరపైకి వచ్చింది. జడేజా త్వరలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ జడేజా టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం కాదు.. టెస్టుల్లో చరిత్ర సృష్టించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. జడ్డూ ప్రస్తుతం 400 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ విభాగంలో అత్యధిక రోజులు టాప్ ప్లేస్‌లో ఉన్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
Osmania University : ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీలతో ఓయూ కీలక ఒప్పందం
చాలా కాలంగా ప్రపంచంలో మరే ఇతర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి ఈ నంబర్ వన్ కిరీటాన్ని లాక్కోలేకపోయాడు. గత 1151 రోజుల నుంచి టెస్టు ఆల్‌రౌండర్ల విభాగంలో జడ్డు అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 2012లో టెస్టుల్లోకి ప్రవేశించిన జడేజా 80 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 3370 పరుగులు సాధించి, 323 వికెట్లు నేలకూల్చాడు. అంతేకాదు ఆల్ రౌండర్ అయి ఉంది సుదీర్ఘ ఫార్మెట్లో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. జడేజా తన టెస్ట్ కెరీర్లో మూడుసార్లు 10 వికెట్లు, 15సార్లు 5 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.
Movie Ticket Prices: సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ సర్కార్ కమిటీ..
