CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK-MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 2026 సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞులైన సీనియర్లు, యువ ఆటగాళ్లతో ఎప్పుడూ సమతూకంగా ఉండే చెన్నైకి.. ఈసారి తమ ఆస్థాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గైర్హాజరీ పెద్ద లోటుగా మారింది. గాయం కారణంగా ధోని కోలుకుంటుండటంతో ఆయన లేని లోటు రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది.
Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!
Also Read
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో కేవలం 19.4 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. రాజస్థాన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. చెన్నై తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ప్రత్యర్థికి విజయం నల్లేరుపై నడకలా మారింది.
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తడబడకుండా కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్ తో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ పరాజయం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటములలో ఒకటిగా నిలిచింది. మిగిలిన బంతుల పరంగా చూస్తే.. గతేడాది కేకేఆర్ (KKR) చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఇది రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.
ఏళ్ల తరబడి జట్టును ముందుండి నడిపి, కష్ట పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించిపెట్టే ధోని లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే టోర్నీ ఇప్పుడే మొదలైందని.. ఒక మ్యాచ్ తోనే జట్టు భవిష్యత్తును అంచనా వేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన జట్టు త్వరలోనే పుంజుకోవాలని, ధోని త్వరగా మైదానంలోకి అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా జట్టులో ధోని లేని లోటు స్పష్టంగా కనపడుతుంది.
తాజావార్తలు
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!