Ravindra Jadeja: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు సిరీస్‌లో 6వ స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఈ సందర్భంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్ పర్యటనలో లక్ష్మణ్ 474 పరుగులు చేసిన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసి 500 పరుగుల మార్కును దాటేశాడు. దీంతో ఈ టెస్టు సిరీస్‌లో 500కి పైగా పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత శుభ్‌మన్ గిల్ (754 పరుగులు), కేఎల్ రాహుల్ (532 పరుగులు)లకు దక్కగా, జడేజా 516 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
Russia: ఓ వైపు 7.0 భూకంపం.. మరోవైపు 600 ఏళ్ల తర్వాత క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం..!
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన భారత ఆటగాడిగా జడేజా మరో మైలురాయిని అధిగమించాడు. సునీల్ గవాస్కర్ ఇంగ్లాండ్‌లో ఒకే సిరీస్‌లో 5 అర్ధశతకాలు చేసిన రికార్డును జడేజా 6 అర్ధశతకాలతో అధిగమించాడు. ఇదే రికార్డుతో వెస్టిండీస్‌కు చెందిన గెర్రీ అలెగ్జాండర్, పాకిస్థాన్‌కు చెందిన వసీం రాజా కూడా సమానంగా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పు తిప్పలు నిలకడగా ఆడిన జడేజా చివరకు జోష్ టంగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
ఇక చివరి మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ ఇంగ్లాండ్ కు 374 పరుగుల భారీ టార్గెట్ ను అందించింది. ఇక మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 13.5 ఓవర్లలో 50 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. మరోవైపు భారత్ విజయానికి 9 వికెట్లు నెల కూల్చాల్సి ఉంది. భారత్ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి సిరీస్ ను 2-2తో సమంచేయాలని భావిస్తోంది.
