Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! ఏకంగా 6000 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Today Rates in Hyderabad on 29th September 2023: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల పెరిగిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,800గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 600.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 650 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,050లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,950గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,020గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,800గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 6000 తగ్గింది. ఇటీవలి కాలంలో ఇంత ధర తగ్గడం ఇదే మొదటిసారి.
Also Read
Also Read: Crude Oil Price: 100డాలర్లకు చేరుకున్న బ్యారెల్ ముడి చమురు ధర.. సామాన్యులకు చుక్కలే
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర శుక్రవారం రూ. 73,700లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,700లు ఉండగా.. చెన్నైలో రూ. 76,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,500గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!