Ashwin: “భారత క్రికెట్లో కొత్త వ్యాధి.. ప్రతి ఆటగాడు ఒక పారిశ్రామికవేత్తే”.. ప్లేయర్స్ తీరుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో సాగుతున్న “ఫ్యాన్ ఆర్మీలు”, కృత్రిమ కథనాలపై రియాక్ట్ అయ్యాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఓ వ్యాధి పీడిస్తోందంటూ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట కంటే తమ బ్రాండ్ వ్యాల్యూని పెంచుకునేందుకే కొందరు ప్లేయర్స్ పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన అశ్విన తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడయాలో పుట్టుకొస్తున్న పుకార్లు గురించి వివరించాడు. తాను ఒక్కోసారి బ్రేక్ఫాట్, లంచ్ టేబుల్స్ వద్ద విన్న వ్యక్తిగత అభిప్రాయాలు సోషల్ మీడియాలో వేరే పేర్లతో ప్రత్యక్ష మవుతున్నాయన్నాడు. అది ఎలా సాధ్య మవుతోందో తనకు అర్థం కావడం లేదన్నాడు. దీని వెనుక ఒక పక్కా వ్యాపార వ్యూహం (Business Model) ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.
READ MORE: Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!
Also Read
- Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
- SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
- Mahela Jayawardene: 13 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
ప్రస్తుతం క్రికెటర్లు ఎంట్రప్రెన్యూర్‌గా మారుతున్నారని, వాళ్ల పీఆర్, బ్రాండ్ విలువను పెంచుకోవడానికి ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ రోజుల్లో ప్రతి ఆటగాడు ఒక వ్యాపారవేత్తే. తమ అభిప్రాయాలను బయటపెట్టడం వల్ల బ్రాండ్ విలువ పెరగవచ్చు. నేను దానికి పూర్తిగా మద్దతిస్తాను. కానీ మరో క్రికెటర్‌ను విమర్శించడం మాత్రం నేను ఎప్పటికీ చేయను. దీన్ని ప్లేయర్స్ స్వయంగా చేయిస్తున్నారని నేను అనను. కానీ ఇది భయానక వ్యాధిగా మారుతోంది. అలాగే భారత క్రికెట్లో ‘సూపర్ హీరో’ సంస్కృతి పెరుగుతోంది. వాస్తవానికి చెప్పాలంటే మనం క్రికెట్‌ను సినిమాగా మార్చేశాం. ఇప్పుడు ఎవరైనా అసలు ఆట గురించి మాట్లాడుతున్నారా? అందరూ ఆటగాళ్ల చుట్టూ ఉండే కథనాల గురించే చర్చిస్తున్నారు. ఒకసారి నేను శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి విశ్లేషిస్తూ ట్వీట్ చేస్తే, వెంటనే దానిని ఇతర ప్లేయర్స్‌తో పోల్చడం మొదలుపెట్టారు.” అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
READ MORE: 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
-
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?