Site icon NTV Telugu

IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం! పాకిస్తాన్‌లా కాదు

Ravichandran Ashwin

Ravichandran Ashwin

India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్‌ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్‌ తీశాడు. పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించిన బంగ్లాకు భారత గడ్డపై తలవంచక తప్పలేదు. భారత్.. పాకిస్తాన్‌లా కాదు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 376 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ (113) సెంచరీ చేయగా.. యశస్వి జైస్వాల్ (56), రవీంద్ర జడేజా (86)లు హాఫ్ సెంచరీలు బాదారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ఐదు వికెట్స్ తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ (32) టాప్ స్కోరర్. భారత పేసర్ బుమ్రా 4 వికెట్స్ పడగొట్టాడు. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. శుభమాన్ గిల్ (119), రిషబ్ పంత్ (109) శతకాలు చేశారు. 515 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 234 పరుగులకు కుప్పకూలడంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది.

Exit mobile version