Eagle : రెండో రోజు జోరు చూపించిన రవితేజ.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ.. “ఈగల్ “.. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.‘ఈగల్’ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో చాలామంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో మెల్లగా మౌత్ టాక్ వల్ల ‘ఈగల్’ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావించారు.
రెండోరోజు ‘ఈగల్’ మూవీ అదే జోరు కొనసాగించింది.. రెండో రోజు దాదాపు రూ.9కోట్ల గ్రాస్‍ను సొంతం చేసుకుంది.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ మూవీకి దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ దక్కినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 32.84 శాతం ఆక్యూపెన్సీతో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మార్నింగ్ షోలకంటే ‘ఈగల్’ మూవీకి సెకండ్ షోలకే ఎక్కువగా డిమాండ్ ఉంది.రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’.. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలయ్యింది. కానీ హిందీలో కలెక్షన్స్ అంతగా లాభదాయాకంగా కనిపించడం లేదు. మొదటిరోజు హిందీ కలెక్షన్స్ రూ.0.1 కోటిగా ఉండగా.. రెండోరోజు మాత్రం కాస్త పెరిగి రూ.0.13 కోట్లకు చేరినట్లు సమాచారం.మొత్తానికి దేశవ్యాప్తంగా ‘ఈగల్’ కలెక్షన్స్ రూ.10 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అయితే ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే ఉన్నా కానీ ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించేలా లేకపోవడంతో ఈ మూవీ రన్ త్వరగానే పూర్తవుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!