Site icon NTV Telugu

Ravi Teja: హిట్ డైరెక్టర్‌, సైన్స్ ఫిక్షన్ స్టోరీ.. ‘రవితేజ’ పెద్ద ప్లానింగే!

Ravi Teja new movie

Ravi Teja new movie

‘మాస్ మహారాజా’ రవితేజ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ‘ధమాకా’ తర్వాత చేసిన సినిమా లేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రీసెంట్‌గా వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్‌లో పడిపోయింది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ రిపీట్ అవడం ఒకటైతే.. టైటిల్ మాస్ జాతర అని ఉండడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ రొటీన్ కథ, కథనంతో రవితేజ తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో తమ హీరో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం కిషోర్ తిరుమలనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సెన్సిబుల్ దర్శకుడు శివ నిర్వాణతో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఓ హిట్ డైరెక్టర్‌తో మాస్ రాజా కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. మొదటి సినిమాతోనే ‘బింబిసార’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మల్లిడి వశిష్టతో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan: తుఫాన్ నష్టం, అవనిగడ్డ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ సమీక్ష!

డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఇటీవల రవితేజకు కథ చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాస్ మహారాజా సినిమా మొదలు కానున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ కాంబోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి. మరి ఈ సినిమాలతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో చూడాలి. ఒక్క హిట్ పడితే రవితేజ కమ్ బ్యాక్ అవుతారు.

Exit mobile version