Site icon NTV Telugu

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్ ఇతనిదే: రవితేజ

Ravi Teja

Ravi Teja

Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రవితేజ.. తనదైన శైలిలో ప్రసంగించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

READ ALSO: Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్‌స్పిరేషన్..!

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ పవన్ ఇచ్చాడని వెల్లడించారు. దర్శకుడు కిషోర్ తిరుమల పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు. “కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన రాసుకున్న డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి” అని పేర్కొన్నారు. ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన బాణీలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయని, విజువల్స్ పరంగా ప్రసాద్ మురళి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. అలాగే హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పారు.

“ప్రతి సంక్రాంతికి నా నుంచి ఒక సినిమా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఈసారి ‘భర్త మహాశయులకు విన్నప్తి’తో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా అందరికీ మంచి వినోదాన్ని అందిస్తుంది. గ్యారెంటీగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అని అన్నారు. జనవరి 13న ఈ చిత్రం విడుదల అవుతుందని అందరూ సక్సెస్ చేయాలని కోరారు. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

READ ALSO: Bhartha Mahashayulaku Vinnapthi: మాస్ మహారాజా రవితేజ బంగారం: హీరోయిన్ డింపుల్ హయతి

Exit mobile version