NTV Telugu Site icon

Ravi Shastri : ఐసీసీ ట్రోఫీ కరువులో టీమిండియా.. మీకు ఓపిక లేదు: భారత మాజీ హెడ్ కోచ్

Ravi Shastri

Ravi Shastri

భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేండ్లు కావొస్తుంది. చివరిసారిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స ట్రోఫీ గెలిచిన తర్వాత మళ్లీ భారత్ దానిని దక్కించుకోలేదు. ఇప్పటికే పలుసార్లు ఫైనల్స్ వరకూ వెళ్లిన అక్కడ బొక్క బోర్లా పడుతున్నది. అయితే ఈ ఏడాది జరుగనున్న ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవడానికి భారత్ కు రెండు అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ కరువును తీరుస్తుందా.. అన్న ప్రశ్నకు భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ట్రోఫీ సాధిచండం ఆషామాషీ కాదనీ.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఈ ట్రోఫీని గెలిచేందుకు 24 ఏండ్లు వేచి చూశాడని.. మెస్సీ కూడా సచిన్ మాదిరిగానే తన చివరి ప్రపంచకప్ లో కల నెరవేర్చుకున్నాడని అన్నాడు.

Also Read : Rahul Gandhi: ప్రధాని కళ్లలో భయం చూశా.. అందుకే నాపై అనర్హత వేటు

నా అభిప్రాయం ప్రకారం భారత్ గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తోంది. టీమిండియా సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వరకూ వెళ్లగలుగుతోంది. సచిన్ ను చూడండి వరల్డ్ కప్ కల సాధించుకోవడానికి అతడు ఆరు ప్రపంచకప్ లు ఆడాడు. అంటే 24 ఏండ్లు.. తాన ఆడిన ప్రపంచకప్ లో అతడు దానిని సాధించుకున్నాడు. మెస్సీ కూడా అర్జెంటీనా తరపున ఎంత కాలంగా ఆడుతున్న అతడు కోపా అమెరికా కప్ తో పాటు గతేడాది పిఫా వరల్డ్ కప్ లో విక్టరీ కొట్టాడు. కొన్ని జరగాలంటే మీకు ఓపిక అవసరం అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Also Read : PAN-Aadhar Link : జస్ట్ ఒక్క SMSతో పాన్, ఆధార్ లింక్

2013తె మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియా మళ్లీ దానిని దక్కించుకోవడంతో వరుసగా విఫలమవుతుందన్నాడు. 2014 టీ20 వరల్డ్ కప్, 2015, 2019 లలో వన్డే వరల్డ్ కప్, 2016,2021, 2022 టీ20 వరల్డ్ కప్ తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 లో జరిగిని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కూడా ఓటమిపాలైందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్.. ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం..

కానీ ఈ ఏడాది భారత్ ఇది వరకే అర్హత సాధించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మెరుగ్గా ఆడితే విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్ 7 నుంచి ఇంగ్లండ్ లోని ది ఓవల్ వేదికగా మొదలయ్యే ఈ మ్యాచ్ మీద భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉంది. స్వదేశంలో జరుగే ఈ టోర్నీలో కప్ కొట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఇది వరకే
20 మందితో కూడిన కోర్ గ్రూప్ ను తయారు చేసి వారినే రొటేట్ చేయాలని భావిస్తున్నది. అయితే వీరిలో పలువురు గాయపడుతుండటం భారత జట్టును కలవరపెడుతుంది.

Show comments