PAN-Aadhar Link : జస్ట్ ఒక్క SMSతో పాన్, ఆధార్ లింక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN-Aadhar Link : పాన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి. లేకుంటే ఏప్రిల్ 1 తర్వాత ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. మీ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31, 2023 నాటికే గడువు ఉంది. అప్పట్లోగా లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పని చేయకుండా పోతుంది. ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ప్రస్తుతం ఏ చిన్న ఆర్థిక లావాదేవీ నిర్వహించాలన్న పాన్ కార్డు కంపల్సరీ… కాబట్టి వెంటనే పాన్-ఆధార్ లింక్ చేయండి.
పాన్-ఆధార్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. మరో వారం రోజులే మిగిలుంది. అప్పటిలోగా ఈ రెండు డాక్యుమెంట్లను అనుసంధానం చేయని పక్షంలో పాన్ నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. ఒక్క SMSతో ఈ రెండింటినీ సులభంగా లింక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఎలా లింక్ చేయాలంటే..
”UIDPAN<12 అంకెల ఆధార్ నెంబర్><పది అంకెల పాన్ నెంబర్>’’ అని టైప్ చేయాలి
పైన పేర్కొన్న సందేశాన్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి.
ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్ ద్వారా..
https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా కూడా పాన్, ఆధార్‌లను లింక్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని ఈ-ఫైలింగ్ పోర్టర్ లో ఇందుకు సంబంధించిన సదుపాయం ఉంది. ఈ ఫైలింగ్ పోర్టల్‌లోని ‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించిన పేజీలో ఆధార్, పాన్ నెంబర్‌లు, ఇతర వివరాలను చేర్చి ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ల అనుసంధానం పూర్తయిపోతుంది.
పాన్, ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా చెక్ చేయండి..
www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్‌లో పాన్ ఆధార్ లింక్ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌లోని ఈ ఫైలింగ్ పేజ్‌లో ‘క్విక్ లింక్స్’ విభాగంలోని ‘లింక్ ఆధార్’ స్టేటస్ అన్న లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై ఆధార్, పాన్ నెంబర్లను ఎంటర్ చేసి ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేస్తే లింకేజ్ అయ్యిందీ లేనిదీ తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..