Ravi Shastri Honored: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరు, మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉండే లెవల్ 1 స్టాండ్ కు ఇకపై ‘రవిశాస్త్రి’ పేరు ఉండనుంది. ముంబై క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది.
Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
రవిశాస్త్రి ముంబై క్రికెట్ నుండి ఎదిగిన గొప్ప ఆటగాళ్లలో ఒకరు. బ్యాటర్ గా, కెప్టెన్ గా, కోచ్ గా, వ్యాఖ్యాతగా ఇలా క్రికెట్ ప్రపంచంలో ఏం చేయగలరో అన్ని ఆయన చేసి భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తనవంతు ప్రయత్నం చేశారు. ఆయన ఆటగాడిగా 80 టెస్టులు, 150 వన్డేలు ఆడారు. ఇక కోచ్‌గా (2017-2021) ఆయన హయాంలో భారత్ చారిత్రాత్మక విజయాలను అందుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు (2018-19, 2020-21) టెస్ట్ సిరీస్ విజయం సాధించడం ఆయన కెరీర్‌లోనే బెస్ట్ గా నిలిచిపోయింది.
ఈ నిర్ణయంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ మాట్లాడుతూ.. “ముంబై క్రికెట్‌కు పునాదులు వేసిన దిగ్గజాలను గౌరవించడం మా బాధ్యత. ఆటగాడిగా, నాయకుడిగా, కోచ్ గా రవిశాస్త్రి అందించిన అమూల్యమైన సేవలకు ఇది చిన్న కానుక” అని పేర్కొన్నారు. రవిశాస్త్రితో పాటు మరో ముగ్గురు దిగ్గజాలకు ‘గేట్’ గౌరవం దక్కింది. రవిశాస్త్రితో పాటు, భారత క్రికెట్ అభివృద్ధికి తోడ్పడిన మరికొందరు దిగ్గజాలకు కూడా వాంఖడే స్టేడియంలో గుర్తింపు దక్కింది. స్టేడియంలోని మూడు ప్రవేశ ద్వారాలకు (Gates) ప్రముఖ ఆటగాళ్ల పేర్లను ఎంసీఏ ఖరారు చేసింది.
Crime News: ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.. కానీ కుటుంబ సభ్యులు మాత్రం?
ఇందులో భాగంగా.. గేట్ నంబర్ 3కి ‘దిలీప్ సర్దేశాయ్’ పేరు, గేట్ నంబర్ 6కి ‘ఏకనాథ్ సోల్కర్’ పేరును, గేట్ నంబర్ 5కి భారత మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చి, 22 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన డయానా ఎడుల్జీకి ఈ గేట్‌ను అంకితం చేశారు. దీనితో ముంబై క్రికెట్ చరిత్రలో ఈ నలుగురు దిగ్గజాల పేర్లు వాంఖడే స్టేడియం రూపంలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి.
