Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం
- టీ20 కెప్టెన్సీ భవిష్యత్తుపై చర్చలు ప్రారంభం
- భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు
- భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా సంజూ శాంసన్ పేరును ప్రస్తావించిన శాస్త్రి
- వచ్చే రెండేళ్లలో సూర్యకుమార్ ప్రదర్శన కీలకమని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా అతని ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్, ఐపీఎల్లో కూడా 11 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం, అలాగే కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా సంజూ శాంసన్ పేరు ప్రస్తావించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాబోయే రెండేళ్లలో సూర్యకుమార్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ భవిష్యత్తు నిర్ణయమవుతుందని అన్నారు. అయితే సంజూ శాంసన్ మాత్రం నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. 2028 టీ20 ప్రపంచకప్ సమయానికి భారత్ కొత్త కెప్టెన్ కోసం చూడవచ్చు. అది సూర్యకుమార్ వచ్చే కొన్నేళ్లలో ఎలా ఆడతాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కానీ సంజూ శాంసన్ ఇప్పటికే తనను నాయకత్వ పాత్రకు అర్హుడిగా నిరూపించుకున్నాడని శాస్త్రి పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్లో ఐదు సీజన్లుగా సంజూ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని శాస్త్రి గుర్తు చేశారు. ముఖ్యంగా 2022 సీజన్లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడం అతని నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా భారత జట్టులో ఓపెనర్‌గా అతను అత్యంత విధ్వంసక బ్యాటర్‌గా ఎదిగాడని కొనియాడారు. టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వరుసగా మూడు అర్ధశతకాలు బాదిన అతను కీలక మ్యాచ్‌ల్లో భారత్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో అతని ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించాయి. ఐసీసీ టోర్నమెంట్లో ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా కూడా ఎంపికయ్యాడు.
సంజూపై ఉన్న సందేహాలన్నింటికీ ఇప్పుడు ముగింపు పడింది. అతనిలో ప్రతిభ ఎప్పుడూ ఉండేది. కానీ దాన్ని నిలకడగా చూపించలేకపోయేవాడు. అయితే ఈ సీజన్లో అతను ఆడిన తీరు, ప్రపంచకప్‌లో బాధ్యత తీసుకున్న విధానం, ఇప్పుడు ఐపీఎల్లో చూపిస్తున్న పరిపక్వత చూస్తే భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలకు అతనే సరైన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను అని రవి శాస్త్రి అన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!