NTV Telugu Site icon

ICC T20I Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా

Icc

Icc

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా కొనసాగుతుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో.. టీ20 నెంబర్ వన్ బౌలర్ గా స్పిన్నర్ రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలోకి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ 9 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు.

Read Also: CM Shivraj Singh Chouhan: మహిళల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న సీఎం.. వీడియో వైరల్..

మరోవైపు.. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో టాప్ 10లో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఐసీసీ వెబ్‌సైట్‌లో తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. బిష్ణోయ్ 699 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ టీ20 బౌలర్ గా ఉన్నాడు. అంతకు ముందు 665 రేటింగ్‌తో 5వ స్థానంలో కొనసాగాడు. గైక్వాడ్ ప్రస్తుతం ప్రపంచ టీ20 బ్యాట్స్‌మెన్‌గా 7వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

Read Also: Winter Season : చలికాలంలో నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే..మంచిదా?

కాగా.. టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన టీమిండియా ఆటగాళ్లలో బిష్ణోయ్ రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇక.. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ 855 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. 787 రేటింగ్‌ పాయింట్లతో రెండవ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు.

Show comments