Industry News : ఆ డైరెక్టర్ తో ప్రేమలో మునిగి తేలుతున్న డబ్బింగ్ ఆర్టిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Industry News : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్. అలాగే ప్రముఖ దర్శకుడితో ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ధృవీకరించడంతో సస్పెన్స్ వీడింది. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో ఆమె వంద పైగా సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆమె మరెవరో కాదు రవీనా రవి.. నయనతారతో సహా పలువురు ప్రముఖ నటీమణులకు కూడా డబ్బింగ్ అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు రవీనా రవి కొన్ని హిట్ సినిమాల్లోను నటించారు.
Read Also:Digital Arrest Scam: 67 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్ట్.. రూ.14 లక్షల మోసం..
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
లవ్ టుడే, మామన్నన్, ఒరు కిదయిన్ కరుణై మను వంటి చిత్రాలలో రవీనా రవి కీలక పాత్రలను పోషించారు. ఆమె నటనకు గాను చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇప్పుడు రవీనా రవి మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్తో తన సంబంధాన్ని కన్ఫాం చేశారు. సోషల్ మీడియాల ద్వారా ఈ విషయాన్ని రవీనా బహిర్గతం చేశారు. తన ప్రేమను ధృవీకరిస్తూ రవీనా రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు దేవన్ జయకుమార్తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోగ్రాఫ్ కి “నశ్వరమైన క్షణాల ప్రపంచంలో మేం శాశ్వతమైనదాన్ని కనుగొన్నాం.. కలిసి మేం మా కథను రాస్తాం“ అని క్యాప్షన్ ఇచ్చారు. పెళ్లి తేదీ తెలుసుకునేందుకు తొందరపడే లోగానే, ఈ ప్రియమైన జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also:Nagavamsi : లక్కీ భాస్కర్ ఎక్కడ బోర్ కొట్టనివ్వదు..
దేవన్ జయకుమార్ మలయాళం చిత్రం `వాలాట్టి`కి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా కుక్కల చుట్టూ నడిచే కథాంశంతో తెరకెక్కింది. సినిమాలో అమలు అనే కుక్కకి రవీనా రవి డబ్బింగ్ చెప్పి తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అక్కడే ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దర్శకుడు దేవన్ జయకుమార్, రవీనా రవి `వాలాట్టి` సినిమాకి పని చేసే సమయంలో ప్రేమ చిగురించిందని గుసగుస వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..