NTV Telugu Site icon

Raj Pakala: కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ!

Raj Pakala

Raj Pakala

Raj Pakala: కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో తేలడంతో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో జరిగిన పార్టీపై డ్రగ్స్ ఎన్డీపీఎస్‌ యాక్ట్ కేసు నమోదు చేశారు.

Read Also: Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

భారి శబ్దాలతో పార్టీ నడుస్తున్నట్లు డయల్‌ 100కు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులు దాడులు చేపట్టి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్‌ టెస్టులు నిర్వహించారు. ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా.. మిగతా వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది. మరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. రాజ్‌ పాకాలపై సెక్షన్‌34, ఎక్సైజ్‌ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.