NTV Telugu Site icon

Puri Jagannath Temple: ఈ రోజు మధ్యాహ్నం తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం తలుపులు

Jagannath Temple Ratna Bhandar Rahasya

Jagannath Temple Ratna Bhandar Rahasya

Puri Jagannath Temple: ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ (ఖజానా) ఈరోజు అంటే జూలై 14న తెరుచుకోనుంది. ఆలయ ఖజానాను చివరిసారిగా 46 సంవత్సరాల క్రితం 1978లో ప్రారంభించారు. రత్న భండార్ లోపలి గదిని ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం తెలిపారు. అందుకు శ్రీమందిర కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత కోసం, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు రిజర్వ్ బ్యాంక్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. అత్యున్నత స్థాయి కమిటీ చైర్మన్ బిశ్వనాథ్ రాథ్ ప్రకారం.. రత్న భండార్ మధ్యాహ్నం 1 నుండి 1.30 గంటల మధ్య శుభ సమయంలో తెరవబడుతుంది. ఇంతకుముందు 1905, 1926, 1978లో రత్న భండారాన్ని ప్రారంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ పాధి తెలిపారు.

పూరీ రత్న భాండాగారం లోపల నుంచి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని చెబుతారు. రిపోజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు. అందుకే రత్న భండారం తెరవకముందే భువనేశ్వర్ నుంచి పాము పట్టడంలో నిష్ణాతులైన ఇద్దరిని ఆలయ కమిటీ పూరీకి పిలిపించి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధం కావాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ దేవాలయం చార్ ధామ్‌లో ఒకటి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రత్న భండారాన్ని తెరవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గతంలో 2011లో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ ఖజానాను తెరిచారు. అప్పుడు రూ.1.32 లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది.

Read Also:Israel Gaza War : ఇజ్రాయెల్ మళ్లీ గాజాలో విధ్వంసం.. 90 మంది మృతి.. 300 మందికి పైగా గాయా

2018లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా రత్న భండార్‌లో 12,831 భారీ బంగారు ఆభరణాలు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారు. వీటిలో విలువైన రాళ్లున్నాయి. 22,153 వెండి పాత్రలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. శ్రీ జగన్నాథ ఆలయ పాలకమండలి హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న భండాగారంలో మూడు గదులు ఉన్నాయి. 25 నుండి 40 చదరపు అడుగుల లోపలి గదిలో 50 కిలోల 600 గ్రాముల బంగారం, 134 కిలోల 50 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు. బయటి గదిలో 95 కిలోల 320 గ్రాముల బంగారం, 19 కిలోల 480 గ్రాముల వెండి ఉన్నాయి. వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తారు. ప్రస్తుత చాంబర్‌లో 3 కిలోల 480 గ్రాముల బంగారం, 30 కిలోల 350 గ్రాముల వెండి ఉన్నాయి.

గత శతాబ్దంలో జగన్నాథ ఆలయం రత్న భండాగారం 1905, 1926, 1978లో తెరచి అక్కడ ఉన్న విలువైన వస్తువుల జాబితాను రూపొందించారు. ఆ తర్వాత 1985లో ఒకసారి రత్న భండాగారం లోపలి భాగాన్ని తెరిచినప్పటికీ జాబితాను అప్‌డేట్ చేయలేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే, 1978 మే 13 నుండి జూలై 13 మధ్య రత్న భండాగారంలో ఉన్న వస్తువుల జాబితాలో, సుమారు 128 కిలోల బంగారం, 222 కిలోల వెండి ఉన్నట్లు చెప్పారు. ఇవే కాకుండా పలు బంగారం, వెండి వస్తువులపై మదింపు జరగలేదు. 1978 నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆస్తి వచ్చిందో తెలియదు.

Read Also:Weather Warnings: నేడు, రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు.. 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు

ఆలయంలోని రత్న భండాగారం తెరవాలన్న డిమాండ్ ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూనే ఉంది. దీనిపై ఒడిశా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అందువల్ల, 2018లో ఒడిశా హైకోర్టు రత్న భండాగారంను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాళం చెవి కనిపించకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత 2018 జూన్ 4న అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు కమిటీ 29 నవంబర్ 2018న కీకి సంబంధించిన తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ప్రభుత్వం దానిని బహిరంగపరచలేదు. కీ గురించి సమాచారం అందలేదు. 2024 వార్షిక రథయాత్రలో రత్న భండాగారాన్ని తెరవాలని గత ఏడాది ఆగస్టులో జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.