Site icon NTV Telugu

Rashmika Mandanna: డైలాగ్‌ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఎలా నటించాలో నాకు తెలుసు: రష్మిక

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika on Animal Movie Trolls: ‘యానిమల్‌’ సినిమాతో కన్నడ సోయగం రష్మిక మందన్న భారీ హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలి పాత్రలో రష్మిక తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కర్వాచౌత్‌ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి. చాలా మంది రష్మిక డైలాగ్ డెలివరీని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్‌ బాగాలేదని తనను ట్రోల్స్‌ చేశారని, ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో తనకు తెలుసని గట్టి కౌంటర్ వేశారు.

‘నో ఫిల్టర్ నేహా’ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ… ‘యానిమల్‌ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ డెలివరీ బాగాలేదని విమర్శిస్తున్నారు. కర్వాచౌత్‌ సన్నివేశం గురించి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సన్నివేశం సినిమాకే ప్రత్యేకం. ఒక్క సీన్‌లోనే ఎన్నో హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. అందుకోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. జనాలకు ఇదేమీ తెలియదు. ఆ సన్నివేశంలో నా నటన చూసి సెట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్‌ బాగాలేదని నన్ను ట్రోల్స్‌ చేశారు. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా’ అని అన్నారు.

Also Read: Mumbai Indians: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్, రష్మికతో పాటు అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్ కూడా నటించారు.ప్రస్తుతం రష్మిక ‘ఛవా’లో విక్కీ కౌశల్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక ఛత్రపతి భార్య పాత్రలో నాకనిపిస్తునారు. మరోవైపు ‘పుష్ప 2’ కూడా చేస్తున్నారు.

Exit mobile version