Site icon NTV Telugu

Rashmika Mandanna No Makeup Look: మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్

Rashmika

Rashmika

Rashmika Mandanna No Makeup Look: హీరోయిన్లు సాధారణంగా మేకప్ లేకండా బయటకు రారు. ఒక వేళ వస్తే తమ లుక్, స్టైల్ గురించి ఎప్పుడూ అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. మేకప్ లేకుండా చాలా మంది హీరోయిన్లను గుర్తించడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రష్మిక మందన్న నో మేకప్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మిక లుక్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Read Also: CM Wife Song: ‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా’ అంటున్న డిప్యూటీ సీఎం భార్య

‘పుష్ప’ ఫేమ్ నటి రష్మిక మందన్న ఇటీవల విమానాశ్రయంలో కనిపించింది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా వారి స్టైల్‌తో ఫోటో గ్రాఫర్లనే కాదు అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నారు రష్మిక. ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మేకప్ లేని లుక్‌లో కనిపించింది. రష్మిక సింప్లిసిటీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సమయంలో, ఫోటోగ్రాఫర్‌లు ఆమె మాస్క్ తీసి ఫోజు ఇవ్వమని కోరారు. ఆమె ఏ మాత్రం సంకోచించకుండా పూర్తి విశ్వాసంతో సాధారణ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు.

Read Also: Kantara Movie Scene Repeat: కోర్టు మెట్లపై వ్యక్తి మృతి.. సేమ్ కాంతారా మూవీ సీన్

ఈ వీడియోలో రష్మిక మందన్న తెల్లటి టీ-షర్ట్‌తో లెగ్గింగ్స్ ధరించింది. అదే సమయంలో చేతిలో ఫోన్, మాస్క్ పట్టుకుని ఉన్నారు. తను ఓ బ్యాగు వేసుకుంది ఉంది. లూజ్ హెయిర్ సింపుల్ చెప్పులతో చాలా అందంగా ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక సింపుల్ లుక్‌లో కనిపించడంతో ఆమెపై అభిమానుల్లో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆమెను తెగపొగిడేస్తున్నారు. తనకున్నంత సింప్లిసిటీ మరేనటికి లేదంటున్నారు. ఒక నెటిజన్ ‘మీలాంటి క్యూట్‌నెస్ మరే ఇతర నటికి లేదు.’ ‘మీరు మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉన్నారు.’ అని ఒకరు. మీ సింప్లిసిటీతో నా హృదయాన్ని కోల్పోయాను అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Exit mobile version