Site icon NTV Telugu

Rashmika Mandanna : రష్మిక ‘మైసా’ గ్లింప్స్ డేట్ లాక్.. కొత్త అవతారంలో నేషనల్ క్రష్

Myssa Ramsjmika

Myssa Ramsjmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Also Read: Naga Chaitanya :నాగచైతన్య కెరీర్‌లో మరో సర్‌ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 24, 2025న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా రవీంద్ర పూలే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన గతంలో స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు.‘కల్కి 2898 AD’ ఫేమ్ అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కాగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రష్మిక చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది. ఇక కథ విషయానికి వస్తే.. సమాచారం ప్రకారం

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ‘గోండు’ తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. హక్కుల కోసం పోరాడే ఒక వీరనారిగా, పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో రష్మిక ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రష్మిక ముఖంపై రక్తపు మరకలతో, చేతిలో ఆయుధం పట్టుకుని చాలా ఇంటెన్స్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి” అనే ట్యాగ్ లైన్ సినిమాలోని యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. మరి గ్లింప్స్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version