NTV Telugu Site icon

Rashmika: పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో

New Project (67)

New Project (67)

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నిర్వహిస్తుంది. పుష్ప 2 ప్రెస్ మీట్ సందర్భంగా ముంబై వేదికగా జరిగిన ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక తన గ్లామర్ తో పిచ్చెక్కించేసింది. అందరి చూపులను తిప్పుకోనివ్వకుండా అందాలతో కట్టిపడేసింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన రష్మిక.. తన స్మైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రెస్ మీట్ లో రష్మిక ‘పుష్ప 2’ ప్రమోషన్లలో భాగంగా చిత్త యూనిట్ తో పాటు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక తన అనుభవాలను పంచుకుంటూ సినిమా గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.

‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న పాన్ వరల్డ్ లెవల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్, రష్మిక జోడీని మళ్లీ తెరపై చూడటానికి వారి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఐకానిక్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్ హైప్ వేరే లెవెల్‌లో ఉందనే చెప్పుకోవాలి. ఈ ఈవెంట్‌ లో రష్మిక తన సింప్లిసిటీతో పాటు స్టైలిష్ లుక్‌, చూపు తిప్పుకోనివ్వని అందాలను ప్రదర్శించి యూత్ న అట్రాక్ట్ చేసింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు, ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచాయి. ప్రొమోషన్లలో భాగంగా విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ‘పుష్ప 2’ కేవలం సినిమా కాదు, ఒక బ్రాండ్‌గా మారిపోతుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీపై ఎంత ఫోకస్ పెడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో రష్మిక పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది, అల్లు అర్జున్ మరింత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నారని సమాచారం. ఈ ఈవెంట్‌తో ‘పుష్ప 2’ కి సంబంధించిన హైప్ మరింత పెరిగింది. డిసెంబర్ 4న యూఎస్ ప్రీమియర్ షోలతో మొదలవుతూ, డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అంతా భావిస్తున్నారు.

Show comments