NTV Telugu Site icon

Rashmika Mandanna: మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక!

Rashmika Mandanna

Rashmika Mandanna

‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపై సందడి చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఆయుష్మాన్‌ ఖురానాతో జతకట్టనున్నారు. ఆదిత్య సర్పోత్దార్‌ తెరకెక్కిస్తున్న ‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌’ సినిమా చిత్రీకరణ అక్టోబరులో మొదలుకానుంది. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read: Barinder Sran: రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత పేసర్‌!

‘వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌ షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. రెండు కాలల మధ్య తీర్చిదిద్దుతున్న భిన్నమైన కథ ఇది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ కోసం విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా ఓ భారీ సెట్‌ను చిత్ర బృందం సిద్ధం చేస్తోంది. ఈ సినిమాతో రష్మిక మందన్న సరికొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ఇందులో మునుపెన్నడూ పోషించని పాత్రలో ఆమె కనిపిస్తారు. రష్మిక పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుంది’ అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Show comments