Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!

Rashmika Kohli

Rashmika Kohli

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న సోషల్ మీడియా రికార్డును రష్మిక అధిగమించింది.

T20 World Cup: శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే సెమీఫైనల్, ఓడితే ఇంటికే.. ఐసీసీ మార్జిన్‌ రిలీజ్!

గత కొద్దికాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన భారతీయ పోస్టు రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీద కొనసాగుతోంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోహ్లీ జట్టుతో కలిసి ట్రోఫీని పట్టుకున్న ఫోటోను షేర్ చేయగా.. దానికి దాదాపు 22 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. దీనితో ఒకే పోస్ట్‌కు ఆసియాలో 20 మిలియన్ల మార్కును దాటిన తొలి అథ్లెట్‌ గా కోహ్లీ చరిత్ర సృష్టించారు.

అయితే.. ఇప్పుడు రష్మిక-విజయ్ దేవరకొండల పెళ్లి ఫోటోలు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 23 మిలియన్ల లైకులను సొంతం చేసుకుని.. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. రష్మిక పోస్ట్ కోహ్లీ రికార్డును దాటడంతో.. కోహ్లీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రష్మిక పోస్ట్‌కు వస్తున్న స్పందన చూసి, నెట్టింట కోహ్లీ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!

“విరాట్ రికార్డును మళ్లీ మనం నంబర్-1 స్థానంలోకి తీసుకెళ్లాలి, అందరూ వెళ్లి ఆ ఫోటోకు లైక్ చేయండి” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ రకమైన ‘లైకుల యుద్ధం’ జరుగుతుందని చెప్పవచ్చు. రష్మిక మందన్నకు దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్ బేస్, విజయ్ దేవరకొండతో ఆమెకున్న క్రేజీ కెమిస్ట్రీనే ఈ భారీ స్పందనకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర, కొడవా సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి పెళ్లి ఫోటోలు.. ముఖ్యంగా అందులో రష్మిక ధరించిన బంగారు ఆభరణాలు, వారిద్దరి లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.