నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి..
ఇకపోతే రష్మికకు అరుదైన గౌరవం తెచ్చిపెట్టింది. వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ని సంపాదించుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారాలు, ఆవిష్కర్తలు, స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది.. యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చిన తన ఫోటోని రష్మిక.. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..
ఇకపోతే పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో ‘చావ’ అనే ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. అలాగే తమిళంలో ధనుష్, శేఖర్ కముల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు. సెట్స్ పై ఉన్న ఇవి కాకుండా, వీటితో పాటు యానిమల్ 2, స్పిరిట్ సినిమా లు చెయ్యబోతుంది..