బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్ .ఈ సినిమా లో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని ఈ మూవీని నిర్మిస్తున్నారు.యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం లో యానిమల్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది.యానిమల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ షూట్ కోసం ఈ చిత్ర హీరో హీరోయిన్లు ముంబైలో సందడి చేశారు. రణ్ బీర్ కపూర్ బ్లూ సూట్ లో కనిపించగా రష్మిక మందన్నా సంప్రదాయ చీరకట్టులో మెరిసింది..
స్టూడియో లోకి వెళ్లేముందు రణ్‌బీర్ కపూర్‌ను ఓ రిపోర్టర్ తెలుగు లో మాట్లాడాలని అడగగా రణ్‌బీర్ కపూర్ తెలుగులో అందరికీ నమస్కారం చెప్పాడు. ఆ తర్వాత మాట్లాడటానికి ఇబ్బంది పడగా .. పక్కనే ఉన్న రష్మిక రణ్ బీర్ కు సాయం చేసింది. నేను బాగున్నాను.. మీరు బాగున్నారా.. అంటూ రణ్‌బీర్‌కపూర్ కు తెలియజేసింది.. మరోవైపు రణ్‌బీర్ కపూర్ కు కన్నడ భాష కూడా నేర్పించింది రష్మిక. ఇప్పుడీ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన థర్డ్ సింగిల్ లిరికల్ సాంగ్ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యం లో ఎమోషనల్‌గా సాగుతూ సినిమా పై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీ కి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.. అలాగే ఈ మూవీలో బాబీ డియోల్ మరియు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను నవంబర్ 23 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.