NTV Telugu Site icon

Rashid Khan: సరికొత్త రికార్డు.. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‭గా అఫ్ఘానిస్థాన్ ప్లేయర్

Rashid Khan

Rashid Khan

Rashid Khan: అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్ దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావోను అధిగమించి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 4న పార్ల్ రాయల్స్‌, MI కేప్ టౌన్ మధ్య జరిగిన SA20 క్వాలిఫయర్ 1లో రషీద్ ఈ అరుదైన ఘనత సాధించాడు. డ్వేన్ బ్రావో 2024లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ముందు 631 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయితే, పార్ల్ రాయల్స్‌బ్యాట్స్‌మన్ డునిత్ వెలలగేను ఔట్ చేసి రషీద్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read: Delhi Elections 2025: కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన రాష్ట్రపతి సహా ప్రముఖులు వీరే!

26 ఏళ్ల రషీద్ ఇప్పటివరకు దాదాపు 500 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ప్రపంచంలోని దాదాపు ప్రతి ఫ్రాంచైజీ లీగ్‌లో రషీద్ ఆడాడు. రషీద్ తన కెరీర్‌లో ఐపీఎల్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) టైటిల్స్ గెలుచుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ (BBL)లో అతను అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున 69 మ్యాచ్‌లు ఆడి 6/17తో తన అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రషీద్ 2015లో టీ20లో అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. 2016 ఏప్రిల్‌లో బ్రావో అతని రికార్డును అధిగమించి తొలి 300 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు దాదాపు 8 సంవత్సరాలు బ్రావో చేతుల్లోనే ఉండింది. 2017 నుండి 2024 వరకు ఏటా 50 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ రషీద్ ఖాన్. ఇతర బౌలర్లు 50 వికెట్లు తీసిన ఐదేళ్లకంటే ఎక్కువ చేయలేకపోయారు. అంతేకాకుండా 2018లో రషీద్ 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీసి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

రషీద్ ఖాన్ టీ20ల్లో నాలుగు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. ఇది టీ20 క్రికెట్‌లో ఏ బౌలర్ సాధించలేని ఘనత. అతను ఈ హ్యాట్రిక్‌లను కెరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్ (BBL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), అఫ్ఘానిస్థాన్ తరఫున ఒకోసారి సాధించాడు. ఇక రషీద్ మ్యాచ్ అనంతరం “ఇది గొప్ప గౌరవం” అని వ్యాఖ్యానించాడు. “పది సంవత్సరాల క్రితం నన్ను ఈ స్థాయికి వస్తావా అని అడిగితే అస్సలు ఊహించేవాడిని కాదు. నా దేశం అఫ్ఘానిస్థాన్ తరపున ఇలా అత్యున్నత స్థాయిలో నిలవడం గర్వకారణం. డ్వేన్ బ్రావో టీ20లో అత్యుత్తమ బౌలర్. ఆ రికార్డును అధిగమించటం ఆనందకరమైన విషయం” అని చెప్పాడు. రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో తన సూపర్ స్పెల్స్‌తో ఇంకా ఎన్నో రికార్డులను బద్దలుకొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఫిబ్రవరి 5న పార్ల్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకి వచ్చిన పార్ల్ రాయల్స్ 19.4 ఓవర్లలో కేవలం 160 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీనితో 39 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ మ్యాచ్‌ను గెలిచింది.