NTV Telugu Site icon

Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్

Snake

Snake

మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములను చూసి ఉంటాం. వాటితో పాటు కింగ్‌ కోబ్రాను కూడా చూసే ఉంటాం.. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే స్నేక్‌ క్యాచర్స్‌ వాటిని తమ టెక్నిక్ తో పట్టి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదులి పెడుతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉండటమే కాకుండా నల్లగా దాని ఒంటిపై తెల్లటి చారను కలిగి ఉంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో ఓ భారీ శ్వేతనాగు ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

Also Read : Manipur Violence: మణిపూర్ హింసలో 54 మంది మృతి..

తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. కురింజి శక్తినగర్‌కు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చొరబడింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. జన్యుపరమైన సమస్య కారణంగా అల్బినో కోబ్రా తెల్లగా ఉంటుందని వన్యప్రాణి సంరక్షకులు వెల్లడించారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్‌ అకౌంట్ లో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అరుదైన నాగుపామును చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.

Also Read : RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ