NTV Telugu Site icon

Pink Diamond : అరుదైన పింక్‌ డైమండ్‌ లభ్యం.. విలువ తెలిస్తే షాకే..

Pink Diamond

Pink Diamond

Rare Pink Diamond Found At Australia.

ప్రపంచంలోనే అరుదైన పింక్‌ డైమండ్‌ అస్ట్రేలియాలో వెలుగు చూసింది. సిడ్నీలోని అంగోలాలో మైనింగ్‌ కార్మికులు అరుదైన స్వచ్ఛమైన పింక్ డైమండ్‌ను కనుగొన్నారు. ఇది 300 సంవత్సరాలలో కనుగొనబడిన అతిపెద్దది అని ఆస్ట్రేలియన్ సైట్ ఆపరేటర్ బుధవారం ప్రకటించారు. దేశంలోని వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతంలోని లులో గనిలో 170 క్యారెట్ల గులాబీ రంగు డైమండ్ కనుగొనబడింది. ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద పింజ్‌ డైమండ్‌లలో ఒకటి అని లుకాపా డైమండ్ కంపెనీ పెట్టుబడిదారులకు ఒక ప్రకటనలో తెలిపింది. అరుదైన మరియు స్వచ్ఛమైన సహజ రాళ్లలో ఒకటైన టైప్ IIa డైమండ్ లభ్యమవడం చారిత్రక ఘటనగా అంగోలాన్ ప్రభుత్వం పేర్కొంది. “లులో నుండి స్వాధీనం చేసుకున్న ఈ రికార్డు మరియు అద్భుతమైన పింక్‌ వజ్రం ప్రపంచ వేదికపై అంగోలాను ఒక ప్రత్యేకమైన ప్రదర్శిస్తూనే ఉంది” అని అంగోలా ఖనిజ వనరుల మంత్రి డయామంటినో అజెవెడో చెప్పారు.

Unknown Facts : మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు..

అయితే గతంలో దొరికిన పింక్‌ డైమండ్‌ కంటే ఇది పెద్దది. భారీ ధ‌ర‌కు ఆ వ‌జ్రాన్ని అంత‌ర్జాతీయ మార్కెట్లో అమ్మ‌నున్న‌ట్లు మంత్రి డయామంటినో అజెవెడో వెల్లడించారు. అయితే లూలో రోజ్ వ‌జ్రాన్ని క‌టింగ్‌, పాలిషింగ్ చేయాల్సి ఉండగా.. దాని వ‌ల్ల ఆ వ‌జ్రం బ‌రువు 50 శాతం త‌గ్గిపోతుందని, గ‌తంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వ‌జ్రాన్ని హాంగ్‌కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. అయితే.. కొత్త‌గా లభ్యమైన ఈ పింక్ డైమండ్ అంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలు ఉన్నాయని.. సుమారు 100 మిలియన్స్‌కు పైనే అమ్ముడు అయ్యే అవకాశం ఉందన్నారు.