మన ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో ఉండే బంగారాన్ని మన భూమిపై ఉన్న మనుషులందరికీ పంచితే.. ఒక్కొక్కరికి సుమారుగా నాలుగున్నర కిలోలు వస్తుందట.

మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణం కొన్ని సెంకడ్లలలో మన పూర్తి శరీరాన్ని తిరిగి వస్తుందంట.

ఒక పెన్సిల్‌తో సుమారుగా యాబై వేల ఇంగ్లీష్ పదాలు రాయవచ్చు.

మన నాలుకపై సుమారు తొమ్మిది వేల రుచి గ్రంధులు ఉంటాయి.

డాల్ఫిన్లు నిద్రలో ఉండగానే ఈదగలవు.

 మనం తుమ్మినప్పుడు మన కళ్ళు తెరిచి తుమ్మడం అసాధ్యం.

మనం పీల్చే ఆక్సీజన్‌లో 20 శాతం మన మెదడు ఉపయోగించుకుంటుంది.

ప్రతిరోజు అమెరికన్లు అందరూ కలిసి సుమారుగా 75 ఎకరాల విస్తీర్ణానికి సమానమైన పిజ్జాలు తినేస్తున్నారంట.

సముద్రాలలో రోజు వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తాయి.