Paritala Sunitha: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లికి వెళ్లినే మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. అసలు జగన్ పరామర్శకు వచ్చాడా..? ఎన్నికల ప్రచారానికి వచ్చాడా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడు.. నీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారు.. నవ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు.
Read Also: LSG Vs KKR: కేకేఆర్ ఈడెన్లో విజయం పరంపర కొనసాగిస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎల్ఎస్జి
ఇక, మేం అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేడు అని హెచ్చరించారు పరిటాల సునీత.. నన్ను, నా కుమారున్ని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడన్న ఆమె.. ఆ రోజు పులివెందులకు వెళ్తే నా భర్త పరిటాల రవిని అడ్డుకున్నావు.. ఈ రోజు మళ్లీ నన్ను, నా కొడుకుని టార్గెట్ చేశావ్ అని మండిపడ్డారు.. అయితే, జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు.. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్ర్కిప్టు జగన్ చదువుతున్నాడు.. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నాడు అని ఎద్దేవా చేశారు.. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా సంఘటన జరిగింది.. పులివెందులలోని బాత్ రూమ్‌ల్లో చంపేందుకు కొడవండ్లు ఉపయోగిస్తారు. గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నాడు.. మీ చిన్నాన్ని చంపితే న్యాయం చేయమని మీ చెల్లలు అడిగింది.. చెల్లికి న్యాయం చేయలేని నువ్వు ఇక్కడికొచ్చి ఏం చేస్తావ్.. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని నువ్వు.. లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తావ్.. అని నిలదీశారు.
Read Also: Uttar Pradesh: ఇదేం “రీల్స్” పిచ్చి.. ప్రయాణిస్తున్న రైలు కింద పడుకుని వీడియో..
మరోవైపు.. మాజీ సీఎంగా ఉండి ఎస్ఐ గురించి నీచంగా మాట్లాడుతున్నావు.. పోలీసులను గుడ్డలూడదీస్తానని చెబుతున్నావు.. జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు.. పోలీసులు నీకు ఈ రోజు రెడ్ కార్పెట్ వేశారు.. ఎస్ఐ మాకు ఫోన్ చేయించాడని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు.. మేము భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతాం.. సిద్ధమా అంటూ సవాల్ విసిరారు పరిటాల సునీత.. వైఎస్ జగన్ పర్యటనను పోలీసులు, మా వాళ్లు ఎక్కడా అడ్డుకోలేదు.. జగన్ చేసిన వ్యాఖ్యల మీద కచ్చితంగా పోలీసులు స్పందించాలని డిమాండ్ చేశారు టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత…