Site icon NTV Telugu

Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

Rapido Rider

Rapido Rider

Rapido Rider: బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్లకు సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలంలో ఎక్కువతున్నాయి. గతంలో ర్యాపిడో ట్యాక్సీ డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మర్చిపోకముందే, తాజాగా ర్యాపిడో స్కూటర్ రైడర్ ప్రయాణికురాలు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలోకి వెళితే..

Read Also: Vellampalli Srinivas: ఎంత మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇచ్చారు..?

జూన్ 14న బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ర్యాపిడో రైడర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆమె బుక్ చేసిన రైడ్ సమయంలో అతడు అతి వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుండటంతో మహిళ నెమ్మదిగా వెళ్లాలని సూచించింది. కానీ, ఆమె మాట పక్కన పెట్టి ఆమెతో వాగ్వాదం చేసాడు. ఈ వాగ్వాదం చివరికి పెద్దగా మారి, ర్యాపిడో రైడర్ నడిరోడ్డుపై ఆమెకు చెంపదెబ్బ కొట్టేంతవరకు వెళ్లింది. అలా అతనయు కొట్టడంతో ప్రయాణికురాలు ఆమె నడిరోడ్డుపై కిందపడిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడున్న వారు ఆపకుండా కళ్లప్పగించి చూసారు కానీ ఎంటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం విడ్డురం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: CM Revanth Reddy: కేసీఆర్ దొరికిన చోటల్లా అప్పు చేసిండు..

ఇక ఈ ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైడర్‌ను విమర్శిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version