NTV Telugu Site icon

Prajwal revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు మరో షాక్‌.. కర్ణాటక పోలీసులు ఏం చేశారంటే..!

Raeew

Raeew

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ రేవణ్ణకు తాజాగా మరో షాక్‌ తగిలింది. అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై సిట్‌ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు బుక్‌ చేశారు. ఐపీసీ సెక్షన్‌ 376 (బీ) (ఎన్‌), 506, 354(ఏ)(2), 354(బీ), 354(సీ), ఐటీ చట్టం కింద కేసు ఫైల్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణను ఏకైక నిందితుడిగా చేర్చారు. ప్రజ్వల్‌పై నమోదైన ఇది రెండో కేసు.

ఇది కూడా చదవండి: Jharkhand: హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్‌ తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు

ఇదిలా ఉండగా ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా జిల్లా ఎస్పీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ సిట్‌ అధికారులను కోరారు. కానీ అందుకు సెట్ తిరస్కరించింది. ఇదిలా ఉంటే ప్రజ్వల్‌ రేవణ్ణకు సెట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఏ క్షణంలోనైనా అతడిని అరెస్ట్ చేయొచ్చు. ప్రజ్వల్‌ రేవణ్ణ తక్షణమే సిటీ ముందు హాజరుకావాలని కర్ణాటక హోంమంత్రి తెలిపారు. లేదంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. మరీ ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: Pawan Kalyan :సీన్ లోకి హరిహర వీరమల్లు.. మరి ‘ఓజి’ రిలీజ్ పరిస్థితి ఏంటి..?

ఇదిలా ఉంటే ప్రజ్వల్‌ రేవణ్ణను హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీఎస్ సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆరోపణలు నిజమైతే పూర్తిగా తొలగిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. కావాలనే ఎన్నికల సమయంలో కుట్రతో ఇరికించారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్