కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది. ఈ పర్యటన సమయంలో రన్యా రావు, తరుణ్ రాజు ఉదయం బయలుదేరి.. సాయంత్రంత తిరిగి వచ్చే వారని.. ఇదే అనుమానాన్ని రేకెత్తించిందని అధికారులు వెల్లడించారు. ఇది అక్రమ కార్యకలాపాలకు సంబంధించిందని.. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.
Read Also: Man Of The Match: ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు వీరే
రన్యా రావు, తరుణ్ రాజు మధ్య మరిన్ని ఆర్థిక లావాదేవీలను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. రాజు తన దుబాయ్-హైదరాబాద్ ప్రయాణ ఖర్చులను రన్యా రావు ఖాతా నుంచి తీసుకున్నట్లు ఆధారాలు లభించాయని.. ఇది స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో రాజు కూడా భాగమనే నిర్ధారణకు చేరుకున్నామని అధికారులు తెలిపారు. 2023 నుండి మార్చి 2025 మధ్యకాలంలో రన్యా రావు దుబాయ్‌కు 52 ట్రిప్పులు చేసింది. వాటిలో కనీసం 26 ట్రిప్పులలో తరుణ్ రాజు ఆమెతో పాటు వెళ్లాడు. ఈ ప్రయాణాలను బంగారు స్మగ్లింగ్ కోసం ఉపయోగించినట్లు అనుమానాలు కలుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
Read Also: ED Raids: జార్జ్ సోరోస్-సంబంధిత సంస్థలపై ఈడీ దాడులు..
ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం కావడంతో అధికారులు తరుణ్ రాజుపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే.. మార్చి 8న అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. దేశం విడిచి వెళ్లేందుకు వీలుకాక పోవడంతో.. అతను హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాడు. దర్యాప్తు ప్రకారం, తరుణ్ రాజు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నాడు. అతని అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా మారాయి. దుబాయ్‌లో అతని ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు, బంగారం కొనుగోళ్లకు సంబంధించి కొన్ని అనుమానాస్పద చెల్లింపులను గుర్తించారు. అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అతని సంబంధాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉండడంతో.. తరుణ్ రాజును కస్టడీలో ఉంచడం అవసరమని డీఆర్ఐ అధికారులు కోరుతున్నారు. అలాగైతేనే.. ఈ కేసు పై మరింత సమాచారం బయటకు రానుంది. బంగారు స్మగ్లింగ్ మాఫియాలో రన్యా రావు, తరుణ్ రాజు పాత్ర ఎంత ఉందో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.