Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ దగ్గర కీలక మైలురాయికి చేరువలో ఉంది. కేవలం 32 రోజుల్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాటేసిన ఈ సినిమా, ఇప్పుడు ‘బాహుబలి 2’ని టార్గెట్ చేసింది. సాధారణంగా ఏ సినిమాకైనా నాలుగో వారం తర్వాత వసూళ్లు తగ్గుముఖం పడతాయి. కానీ ‘ధురంధర్’ విషయంలో అది రివర్స్ అవుతోంది. ఐదో వీకెండ్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1783 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 1800 కోట్ల చేరువలో ఉంది.
Also Read : Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్ లేని టాలీవుడ్
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
ఇప్పటికే పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసి మూడో ప్లేస్‌లోకి దూసుకొచ్చిన ధురంధర్ 2.. బాహుబలి 2 రికార్డు బ్రేక్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. కేవలం ఇండియాలోనే రూ.1153 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతోంది. కొన్ని దేశాల్లో ఈ చిత్రంపై నిషేధం ఉన్నప్పటికీ, ఓవరాల్ ఓవర్సీస్‌లో రూ.423 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇండియాలో గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1360 కోట్లకు చేరుకున్నాయి. ఈ జోరు చూస్తుంటే బాహుబలి 2ని వెనక్కి నెట్టి ఇండియన్ ఆల్ టైమ్ టాప్ 2 సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే రూ.2000 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అవడం మాత్రం కష్టమనే చెప్పాలి. కానీ, ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తే.. ధురంధర్ 2 ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఏదేమైనా.. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ.. ఒక నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర నాన్ స్టాప్‌గా దూసుకుపోతోంది ధురంధర్ 2.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!