బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ప్రలే’పై దృష్టి పెట్టారు. జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ‘పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్’గా రూపొందనుంది. ఈ భారీ ప్రాజెక్టులో కథానాయికగా అలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ ‘గల్లీ భాయ్’, ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాలతో అలరించగా, ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీలో వీరి కాంబినేషన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read : Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో ఊహించని లుకా.. సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
అయితే, ఈ చిత్రంలో అలియా పాత్ర కేవలం ఒక ప్రేమికురాలిగా మాత్రమే ఉండదని, రణ్‌వీర్ చేసే ఆలోచనలను సవాలు చేసేంత శక్తిమంతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో రణ్‌వీర్ మనుగడ (survival) కోసం పోరాటం చేసే వ్యక్తిగా కనిపించనున్నారు. ప్రస్తుతం అలియాతో చర్చలు జరుగుతుండగా, వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ రియాలిటీలో సెట్ అయితే మాత్రం ప్రేక్షకులకు ఒక ‘నెక్స్ట్ లెవెల్’ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లభించడం ఖాయం!
