Ranveer Singh: డైరెక్టర్ శంకర్‌ కుమార్తెతో డ్యాన్స్‌ తో అలరించిన రణ్‌వీర్‌ సింగ్‌.. వీడియో వైరల్..

8

8

ప్రముఖ సినీ దర్శకుడు శంకర్.. తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలలో భాగంగా చెన్నై నగరంలో మంగళవారం నాడు జరిగిన వివాహ విందులో భాగంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also read: Ponnam Prabhakar: శ్రీ రామనవమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతుల ప్రత్యేక పూజలు

ఇక దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి చిరంజీవి దంపతులు, విజయ్ సేతుపతి, అట్లీ, మోహన్లాల్, లోకేష్ కనకరాజు, రకుల్ ప్రీత్ సింగ్, అనిరుద్, ఏ ఆర్ రెహమాన్, హీరో రామ్ చరణ్ లాంటి అగ్ర తారలు హాజరై నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంకి బాలీవుడ్ అగ్రకత నాయకుడైన రణ్‌వీర్‌ సింగ్ కూడా హాజరయ్యాడు. కేవలం హాజరు అవ్వడమే కాకుండా.. శంకర్ చిన్న కుమార్తె అదితితో కలిసి ఆయన ‘లుంగీ డాన్స్’ అలాగే ‘వాటి కమింగ్’ వంటి పాటలకు డాన్స్ చేశారు.

Also read: Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

వీరితో పాటు డైరెక్టర్ అట్లీ కూడా ఈ డాన్స్ లో కాలు కదిపాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే శంకర్ మొదటి కుమార్తె ఐశ్వర్య ఓ వైద్యురాలు. ఈడకు ఇది రెండో వివాహం. 2021 లో ఇదివరకే క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో వివాహం జరగగా వారిద్దరు పరిష్కార అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఐశ్వర్య పెళ్లి చేసుకున్న తరుణ్ కార్తీక్ సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ నిర్మిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులలో కూడా ఆయన పని చేస్తున్నాడు.