Virat Kohli: విరాట్ కోహ్లీ ఎఫెక్ట్.. అందుకు ఓకే చెప్పిన బీసీసీఐ!

  • దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమమైన కింగ్
  • రైల్వేస్‌తో మ్యాచ్‌లో బరిలోకి విరాట్
  • విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఆసక్తి
Virat Kohli

Virat Kohli

2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

రోస్టర్‌ విధానంలో మూడు రంజీ మ్యాచ్‌లకు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. ఈ మూడింటిలో విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్‌కు చోటు లేదు. అయితే విరాట్ క్రేజ్ దృష్టా చివరి క్షణంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుందని ఓ బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఢిల్లీలో కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఓ శుభవార్త అని, ఫాన్స్ ఇంట్లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన విరాట్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు.

Also Read: KTR-Trisha: త్రిష.. నిన్ను కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్‌

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మెడ నొప్పి కారణంగా జనవరి 23న సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో కింగ్ ఆడలేదు. ఢిల్లీ తరఫున కోహ్లీ 23 మ్యాచ్‌ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున 5 సెంచరీలు చేశాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడడం లేదని తెలుస్తోంది. ఆయుష్ బడోని కెప్టెన్సీ చేయనున్నాడు.