Site icon NTV Telugu

Ranji Players Amount: ఇకపై రంజీ క్రికెటర్లకు కాసుల పంట.. సీజన్ కు రూ. కోటి వరకు..?

Ranji Players

Ranji Players

దేశవాళీ క్రికెటర్ల జీవితాలు బాగుపడనున్నాయి. రాబోయే సీజన్ నుండి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు రెట్టింపు కాబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కొనసాగుతుంది. ఇకపోతే అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టర్ పొందిన ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తుంటే మరోవైపు ఒళ్ళు హూనం చేసిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లాడే క్రికెటర్లకు మాత్రం లక్షల రూపాయలలో మాత్రమే సరిపెట్టింది బీసీసీఐ. కాకపోతే ఇప్పుడు ఈ విషయాన్నీ పూర్తిగా సరిదిద్దాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Also Read: Viral Video: ఓ వైపు ఫుల్ ట్రాఫిక్.. ఇంకోవైపు ఆ అమ్మాయి ఏం చేసిందంటే..!

ఈ నేపథ్యంలోనే జరగబోయే 2024 – 25 దేశవాళీ సీజన్ నుంచి అందులో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల రూపంలో 75 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. వీటికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది బీసీసీఐ. ఇప్పటివరకు రంజి ట్రోఫీలో ఆటగాళ్ల సీనియారిటీని బట్టి మ్యాచ్ ఫీజులను చెల్లిస్తూ వస్తుంది బిసిసిఐ. 20 కంటే తక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్లకి రోజుకి 30 వేల రూపాయలు, 21 నుంచి 40 మ్యాచ్లు ఆడిన ఆడవాళ్లకు రోజుకు 50 వేల రూపాయలు, 40 కి పైగా రంజీ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు ఒక్కో రోజుకి 60 వేల రూపాయలుగా బిసిసిఐ చెల్లిస్తుంది.

Also Read: T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్‌.. ఆఫీసియల్..

ఇక ఆటగాళ్లు తమ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదన్న బాధను దేశవాళి క్రికెటర్లలో లేకుండా చేసేందుకు రంజి మ్యాచులు ఫీజులు ఏకంగా 75 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు చెల్లించేలా బిసిసిఐ చర్యలు చేపట్టబోతోంది. చర్యలు కేవలం రంజి మ్యాచులు ఆడే ఆటగాళ్లకు కాకుండా దేశవాళిలో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే, దేవదర్, ఇరానీ ట్రోఫీ లకు సంబంధించిన మ్యాచ్ లకు ఈ కొత్త రూల్స్ ను కూడా అప్లై చేయబోతున్నారు.

Exit mobile version