జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
- భారత మార్కెట్లో రేంజ్ రోవర్ ఎస్వీ సవాయ్ కలెక్షన్
- రూ.4.90 కోట్ల ప్రారంభ ధరతో విడుదల
- సవాయ్ జైపూర్, సవాయ్ జోధ్‌పూర్, సవాయ్ జైసల్మేర్ పేర్లతో మూడు ఎడిషన్లు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Range Rover SV Sawai Collection Launched: భారత మార్కెట్లో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ (Range Rover) సరికొత్త స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేసింది. రేంజ్ రోవర్ ఎస్వీ సవాయ్ కలెక్షన్ (Range Rover SV Sawai Collection) పేరుతో తీసుకొచ్చిన ఈ లగ్జరీ ఎస్యూవీ ప్రారంభ ధరను రూ.4.90 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ స్పెషల్ కలెక్షన్లో కేవలం 18 కార్లను మాత్రమే విక్రయించనుంది. జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ నగరాల సంస్కృతి, నిర్మాణ శైలుల ఆధారంగా మూడు ప్రత్యేక ఎడిషన్లను తీసుకవచ్చారు.
ఈ కలెక్షన్లో సవాయ్ జైపూర్, సవాయ్ జోధ్‌పూర్, సవాయ్ జైసల్మేర్ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఒక్కో ఎడిషన్‌లో కేవలం 6 కార్ల చొప్పున మొత్తం 18 యూనిట్లను తయారు చేశారు. మూడు మోడళ్లలోనూ 23 అంగుళాల షాంపైన్ (Champagne) అల్లాయ్ వీల్స్, అట్లాస్ సిల్వర్ ఎక్స్టీరియర్ ప్యాక్, 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన రేంజ్ రోవర్ బ్రాండింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి కారులో ఎడిషన్ పేరు, ‘1 of 6’ అనే ప్రత్యేక గుర్తింపుతో వ్యక్తిగతీకరించిన ప్లాక్ ఉంటుంది.
Also Read
- CERT-In Warning: "హ్యాక్ చేసే ప్రమాదం".. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
- Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
- Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
- కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
సవాయ్ జైపూర్ ఎడిషన్‌ను పింక్ సిటీ జైపూర్ స్ఫూర్తితో రూపొందించారు. రోజ్ కలర్ ఎక్స్టీరియర్, ఎక్రూ, డీప్ గార్నెట్ కలర్ ఇంటీరియర్ ఇందులో ఉన్నాయి. హవా మహల్‌లోని జరోఖా డిజైన్ ఆధారంగా సీట్లపై ఎంబ్రాయిడరీ చేశారు. అలాగే సవాయ్ జోధ్‌పూర్ ఎడిషన్ బ్లూ సిటీ ప్రత్యేకతలను కలిగి ఉంది. లేత నీలం రంగు ఎక్స్టీరియర్తో పాటు పేర్లినో, రివీర థీమ్ ఇంటీరియర్ అందించారు. జోధ్‌పూర్ కోటలు, రాజభవనాల్లో కనిపించే జాలి డిజైన్లను సీట్లపై పొందుపరిచారు. ఇక సవాయ్ జైసల్మేర్ ఎడిషన్ గోల్డెన్ సిటీ స్ఫూర్తితో రూపొందింది. బంగారు రంగు ఎక్స్టీరియర్, పెర్లినో, కారవే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఉన్నాయి. జైసల్మేర్ కోట నిర్మాణ శైలి, సంప్రదాయ బ్లాక్ ప్రింటింగ్ ఆధారంగా సీట్లపై ఎంబ్రాయిడరీ చేశారు.
ఈ 18 కార్లన్నీ లాంగ్ వీల్‌బేస్ రేంజ్ రోవర్ SV ఆధారంగా రూపొందించారు. నాలుగు సీట్ల లేఅవుట్‌తో వస్తాయి. వెనుక సీట్లలో హీటింగ్, కూలింగ్, మసాజ్ సదుపాయాలతో పాటు రిక్లైనింగ్ ఫంక్షన్ అందించారు. వెనుక ప్రయాణికుల కోసం ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, ఫోల్డ్ అవుట్ టేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. 4.4 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ V8 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 537hp పవర్, 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా రేంజ్ రోవర్ తీసుకొచ్చిన మూడో ప్రత్యేక కలెక్షన్ ఇది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!