Jharkhand: హేమంత్ సోరెన్‌కు కోర్టులో ఊరట.. బలపరీక్షకు వచ్చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో ఊరట లభించింది. సోమవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శాసనసభలో జరిగే బలపరీక్షకు హాజరుకానున్నారు.
శుక్రవారం చంపయ్ సోరెన్ (Champai Soren) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్.. చంపయ్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని 10 రోజులు చంపయ్‌కు గవర్నర్ గడువు ఇచ్చారు. కానీ అంతకంటే ముందుగానే ఈ కార్యక్రమం ముగించేయాలని చంపయ్ సోరెన్ సిద్ధపడ్డారు. సోమవారం నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఫిబ్రవరి 5నే (సోమవారం) అసెంబ్లీలో బలపరీక్షకు సంకీర్ణ ప్రభుత్వం సిద్ధపడింది.
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
ఇదిలా ఉంటే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంచితేనే సేఫ్ అని భావించడంతో భాగ్యనగరానికి తరలించారు. సోమవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. కూటమికి మొత్తం 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. బలపరీక్షలో ఓటు వేసేందుకు కోర్టు అనుమతి కోరగా.. తాజాగా న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:Punjab: పంజాబ్ గవర్నర్ షాకింగ్ నిర్ణయం
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!