Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor Ramayana: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణం’ మొదటి భాగం విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. షూటింగ్ సెట్లో ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సెట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడం అందరినీ కలవరపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గురించి ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రతినిధులు వివరాలు వెల్లడించారు.
FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, స్టూడియో బయట వేసిన ఒక చిన్న టెంట్లో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయని తెలిపారు. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే దగ్గర్లోని మరో ప్రాంతంలో ఇలాగే మంటలు చెలరేగడంతో, షూటింగ్ సెట్లలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్మాతలకు సూచించామని, అయినా కూడా నిర్లక్ష్యం వల్ల మళ్లీ రామాయణం సెట్లో ఈ ఘటన జరిగిందని తివారీ అభిప్రాయపడ్డారు. ఈ సారికి పెద్ద నష్టమేమీ జరగకపోయినా, రాబోయే రోజుల్లో ప్రతి ప్రొడక్షన్ హౌస్ మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ఒక హెచ్చరికలాంటిదని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ప్రస్తుతం ఈ బాలీవుడ్ సినిమా రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దర్శకుడు కానీ, రణ్‌బీర్ కపూర్ కానీ అక్కడ ఉన్నారా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇకపోతే, ఇటీవలే ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ‘మిస్టర్ బీస్ట్’ ఈ సెట్‌ను సందర్శించి, సినిమా ప్రమోషన్లలో భాగమవడం ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను భారత్‌లో నవంబర్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5, 6 తేదీల్లో వేర్వేరు ప్రాంతాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?