Site icon NTV Telugu

Ranbir Kapoor: రాముడు కేవలం పాత్ర కాదు.. నా అదృష్టం!  

Ranbeer Kapoor, Ramayana

Ranbeer Kapoor, Ramayana

దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్ అయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. అయితే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఐమ్యాక్స్ (IMAX) థియేటర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆయన కోట్లాది మందికి ఆత్మసాక్షి. కరుణ, ధైర్యం, ధర్మాలకు ప్రతీక అయిన మర్యాద పురుషోత్తముడి పాత్రను పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ రణ్‌బీర్ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Nag Ashwin: ‘ధురందర్ 2’ సక్సెస్‌పై..నాగ్ అశ్విన్ క్రేజీ కామెంట్స్!

ఏప్రిల్ 2న (హనుమాన్ జయంతి) విడుదల కానున్న ఈ గ్లింప్స్ లెంగ్త్ 2 నిమిషాల 38 సెకన్లు ఉండబోతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ ప్రశాంతమైన లుక్‌లో కనిపిస్తుండగా, పల్లవి (సీత), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో.. రావణుడిగా కన్నడ స్టార్ యష్ (Yash) అగ్నిపర్వతంలాంటి రౌద్ర రూపంలో మెప్పించబోతున్నారు. ఇక విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని మించి ఈ సినిమా ఉండబోతుందట. ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విజువల్స్ చూస్తుంటే డైరెక్టర్ నితీష్ తివారీ ఈ కథను ఎంత భారీగా ప్లాన్ చేశారో అర్థమవుతోందట.

Exit mobile version